"ఓ మంచి దేవుడా.. నాకో మంచి సైకిలును ప్రసాదించు స్వామీ...! వినిపిస్తోందా..?" వేడుకుంటున్నాడు రవి
"అబ్బా అంత గొంతు చించుకుని అరుస్తావేంట్రా... కాస్తంత మెల్లిగా అడిగితే దేవుడికి వినపడదా..?" కోపగించుకుంది తల్లి
"దేవుడికి వినిపిస్తుంది కానీ... నాన్నకి వినిపించాలిగా మమ్మీ...!"