పిల్లలు హోంవర్క్ చేయడానికి మారాం చేస్తున్నారా..!!
, గురువారం, 12 ఏప్రియల్ 2012 (10:51 IST)
ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్ చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. కొందరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు పక్కన పడేసి ఆటలాడటానికి పరుగెత్తుతారు. ఉదయం లేవగానే హోంవర్క్ చేయలేదనే విషయం గుర్తొచ్చి, టీచర్ తిడుతుందని లేదా కొడుతుందని స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారితో హోంవర్క్ సులభంగా పూర్తిచేయించవచ్చు.* ప్రతిరోజూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హోంవర్క్ ఏంటి? అనే విషయాలను అడిగి కనుక్కోవాలి.* హోంవర్క్ చేసే సమయంలో పిల్లలకు చాలా సందేహాలు వస్తుంటాయి. అలాంటపుడు దగ్గరుండి వారి సందేహాలను తీర్చాలి. దాంతో వారు మరింత ఉత్సాహంగా హోంవర్క్ పూర్తి చేస్తారు.* పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హోంవర్క్ చేసుకొనేలా చేస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హోంవర్క్ తొందరగా ఉత్సాహంగా కంప్లీట్ చేస్తారు.* సమయంలోగా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలని షెడ్యూల్ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్‌లో పనిపూర్తి చేసుకునే అలవాటు వస్తుంది.* పిల్లలు హోంవర్క్ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడటం చేయకూడదు. దానివల్ల వారి కాన్‌సన్‌ట్రేషన్ దెబ్బతింటుంది.