తల్లిపాలతోబాటు తేలికపాటి ఆహారం ఇవ్వండి
పిల్లవానికి ఆరు నెలలు వచ్చిన తర్వాత తేలికపాటి ఆహారం ఇవ్వండి.
పిల్లవానికి తల్లి పాలు శ్రేష్టమైంది. కాని పిల్లవాడు పెరిగేకొద్ది తల్లిపాలతోబాటు తేలికపాటి ఆహారం కూడా ఇవ్వాలంటున్నారు వైద్యులు. దీంతో పిల్లవాని ఆకలికూడా తీరుతుంది. పిల్లలు మెల్లమెల్లగా ఆహారాన్నితీసుకోవడానికి అలవాటు పడుతారు. తేలికపాటి ఆహారంలో ఉడకబెట్టిన కాయగూరలు, మెత్తటి పళ్ళు, అన్నం, పప్పు దినుసులు తదితరాలు ఆహారంగా ఇవ్వాలంటున్నారు వైద్యులు.
పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం :
** పిల్లలు పుట్టిన ఐదారు నెలల వరకు తల్లిపాలను ఇవ్వడం ఎంతో శ్రేష్టం.
** ఆరవ నెలనుంచి పిల్లలకు బేబీఫుడ్, మెత్తటి పండ్లు, పప్పుదినుసుల తేట ఇవ్వడం ప్రారంభించాలి.
** చిన్న పిల్లలకు ఎక్కువగానున్న తీపి పదార్థాలు, మసాలా పదార్థాలు, కొవ్వుతోకూడుకున్న పదార్థాలు ఇవ్వకూడదు.
** ఎనిమిదినుంచి పన్నెండు నెలల మధ్యలోనున్న పిల్లలకు బ్రెడ్, టోస్ట్ లాంటివి ఆహారంగా తినిపించాలి.
** ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ఆహారం తాజాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పండ్లను కోసిన తర్వాత వాటిని ఒక గంట తర్వాత ఇవ్వకూడదంటున్నారు వైద్యులు.
** పిల్లలకిచ్చే ఆహారంలో పరిశుభ్రత పారటించాలి.
** మీరిచ్చే ఆహారంతో అలర్జీ వస్తే దానిని వారికి ఇవ్వకుండా నిలిపివేయండి.