Publish Date: Fri, 13 Feb 2015 (15:05 IST)
Updated Date: Fri, 13 Feb 2015 (15:13 IST)
సెల్ ఫోన్ పుణ్యమా అని ప్రస్తుతం సెల్ జాగరణ అనే మాట కొత్త పుట్టుకొచ్చిందని చెప్పాలి. దీన్నే వ్యాపింగ్ అనే పేరుతో పిలుస్తున్నారు. రాత్రంతా అవతలి వ్యక్తితో సెల్‌లో చాటింగ్ చేయడాన్ని స్థూలంగా వ్యాపింగ్ అంటారు.
ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్, ఫోటో షేరింగ్, మెసేజ్‌లు ఇలా రాత్రంతా ప్రతీ దాన్నీటచ్ చేయడం వ్యాపింగ్‌లో భాగమే. ఈ ధోరణి టీనేజర్లలో అధికంగా ఉన్నట్లు రకరకాల సర్వేలు చెబుతున్నాయి.
మిగిలిన దేశాలతో పోల్చితే అమెరికాలో వ్యాపింగ్ అధికంగా ఉంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు చాలా తక్కువ నిద్ర పోతున్నారని తేలింది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.
చదువు దెబ్బతింటోంది. అందుచేత ఈ వ్యాపింగ్ భూతాన్ని వదిలించుకోవాలంటే.. పిల్లల పట్ల తల్లిదండ్రులు అధికమైన కేర్ తీసుకోవాలని, వారు ఉపయోగించే సెల్ ఫోన్లను రాత్రి పూట కట్టేయాలని ఆర్డర్‌లా కాకుండా అర్థమయ్యేలా చెప్పాలని మానసిక నిపుణులు అంటున్నారు.
Selvi
Publish Date: Fri, 13 Feb 2015 (15:05 IST)
Updated Date: Fri, 13 Feb 2015 (15:13 IST)