Publish Date: Mon, 23 Mar 2015 (18:32 IST)
Updated Date: Mon, 23 Mar 2015 (18:38 IST)
పరీక్షలంటే భయం వద్దే వద్దు.. ఒత్తిడి అస్సలొద్దు.. హాయిగా నిద్రపోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పరీక్షలంటే ఒత్తిడికి లోనుకాకుండా బాగా ప్రిపేర్ అయి.. అలా పార్కుల్లో కాసేపు కూర్చోండి. మంచి గాలిని పీల్చడం. పది నిమిషాల పాటు మెడ, భుజాలు, హెడ్‌కు ఎక్సర్‌సైజ్ లభించేట్లు నడవండి. తర్వాత రాత్రిపూట టెన్షన్ పడకుండా 6 గంటల పాటు నిద్రపోండి.
చివరి క్షణాల వరకు రీడింగ్ చేయకండి. తద్వారా కంటికి విశ్రాంతి లభించదు. దీంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతారు. పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలంటే అన్నింటిని ప్రణాళిక ప్రకారం చేయాలి. శారీరకంగానూ ఫిట్‌గా ఉండాలి. ఆహారం తీసుకోవడం మెలకువలు తప్పనిసరి. ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. కొంచెం కొంచెంగా వారానికి 3 లేదా నాలుగు సార్లు తీసుకోవచ్చు. జింక్, ఒమేగా-3, బి విటమిన్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అప్పడప్పుడు జోకులు వినడం, వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు మాట్లాడటం వంటివి చేస్తే తప్పకుండా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను రాబట్టుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.
Selvi
Publish Date: Mon, 23 Mar 2015 (18:32 IST)
Updated Date: Mon, 23 Mar 2015 (18:38 IST)