Publish Date: Mon, 29 Dec 2014 (13:51 IST)
Updated Date: Mon, 29 Dec 2014 (13:55 IST)
పిల్లల ప్రోత్సహించకపోయినా పర్లేదు. కానీ డిస్కరేజ్ మాత్రం చేయవద్దని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. కుటుంబంలో లేదా సమాజంలో ఇమడలేరని పిల్లల్ని ఎప్పుడూ అవహేళన చేయవద్దు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళ అంచనాల మేరకు ఎప్పుడూ ఉండలేరు. ఇటువంటి అవహేళనలవల్ల వారిలో వారు ఒంటరితనాన్ని అనుభవిస్తూ, పెద్ద సమస్యల్లోకి దిగిపోతారు.
అలాగే కొన్ని విషయాల్లో స్వంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పిల్లలకు ఇవ్వాలి. ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడాన్ని వారికి నేర్పించాలి. దీనివల్ల విజయాల్ని, వైఫల్యాలను అందుకోగలశక్తి వారికి అలవడుతుంది.
ఇక ప్రతి ఒక్కరిలోనూ ఏదోక ప్రతిభ దాగి వుంటుంది. దానిని వెలికితీసే ప్రయత్నం చేయాలి. ప్రతీసారీ పిల్లల్లో తప్పుల్ని పట్టుకునే బదులు కొన్నిసార్లు వారిలో దాగివున్న ప్రతిభను, మంచిని గుర్తించే ప్రయత్నం చేయాలని సైకాలజిస్టులు అంటున్నారు.
Selvi
Publish Date: Mon, 29 Dec 2014 (13:51 IST)
Updated Date: Mon, 29 Dec 2014 (13:55 IST)