Publish Date: Thu, 02 Jul 2015 (17:27 IST)
Updated Date: Thu, 02 Jul 2015 (17:30 IST)
వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు పుట్టుకతో సంక్రమిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే పుట్టిన నెలను బట్టి కూడా వ్యాధులు వస్తాయని కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు 28 ఏళ్ల పాటు, కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియవచ్చాయి. ఈ క్రమంలో జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టిన వారికైతే ఆస్తమా వచ్చే అవకాశం ఉందని, మార్చిలో పుట్టిన వారికి గుండె సంబంధిత రోగాలు ఏర్పడుతాయని పరిశోధకులు తేల్చారు.
పుట్టిన నెల ఆధారంగా సుమారు 1700కు పైగా అనారోగ్య సమస్యలు పసి పిల్లలను చుట్టుముట్టే ప్రమాదం ఉందని, వాటిల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. అయితే పిల్లల ఆరోగ్య సమస్యల నిర్థారణ సమయంలో ఈ పరిశోధనల్లోని విషయాలు వైద్యులకు ఉపయోగపడతాయని భావిస్తున్నామని.. కానీ పుట్టిన నెలను బట్టి ఇవే వ్యాధులు వస్తాయని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని పరిశోధకులు అంటున్నారు.
ఇంకా న్యూయార్క్ మెడికల్ డేటాబేస్ పరంగా 1.7 మిలియన్ రోగులు పుట్టిన నెల ప్రకారం ఏర్పడిన 55 వ్యాధులతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. అలాగే మే నెలలో పుట్టిన పిల్లల్లో రోగాలు చాలా తక్కువని, కానీ అక్టోబర్, నవంబర్‌లో పుట్టిన పిల్లల్లో వ్యాధుల సంఖ్య అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
Selvi
Publish Date: Thu, 02 Jul 2015 (17:27 IST)
Updated Date: Thu, 02 Jul 2015 (17:30 IST)