చెక్కు చెదరని మంచు గుహలు... కరోనా వైరెస్ భయంతో పర్యాటకులు నో

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (19:38 IST)
సాధారణంగా గుహలంటే రాతితో ఏర్పడి ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో ఏడాది అంతటా చెక్కు చెదరకుండా ఉండే మంచు గుహలు ఉన్నాయని మీకు తెలుసా.. బయట వాతావరణానికి భిన్నంగా ఈ గుహల్లో మంచు ఏర్పడుతుంది. అమెరికా, చైనాల్లో ఉన్న ఇలాంటి వింత గుహలు విశేషాలు ఎన్నో ఉన్నాయి.
 
చలికాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మంచుతో గడ్డకట్టి మంచు గుహలేర్పడుతూ ఉంటాయి. కానీ చైనాలోని లుయుషాస్ మౌంటేన్ నింగ్ వు మంచు గుహ మాత్రం ఇందుకు మినహాయింపు. ఇది సంవత్సరమంతటా ఏ వాతావరనంలోనూ కరిగిపోకుండా చెక్కుచెదరకుండా ఉంటుందట ఈ మంచు గుహ. దాంతో చైనాలో ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. 
 
రంగురంగుల లైట్ల వెలుతురులో మంచుగడ్డలు సప్తవర్ణాలతో హొయలు పోతుంటాయి. బయట వాతావరణంలో ఉష్ణోగ్రత 17 డిగ్రీ సెల్సియస్ ఉన్నా గానీ ఈ గుహలోని మంచు కరగదు. చైనాలోని మంచు గుహల్లో ఇదే అతిపెద్ద మంచు గుహ కావడం విశేషం. దాదాపు 30 లక్షల యేళ్ళ క్రితం ఏర్పడిన మంచు గుహ ఇది. 
 
గుహ లోపల ఏర్పడిన ఆకృతి కారణంగా బయట వాతావరణంలోని వేడిగాలి లోపలికి ప్రవేశించదట. 20వ శతాబ్ధం నుంచి ఇది టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల దాదాపు పాతికేళ్ళుగా ఇది మూతపడి ఉంది. అయితే ఈ ప్రకృతి వింత చూసేందుకు వచ్చే సందర్సకుల కోసం రెండేళ్ళ క్రితం ఈ గుహను మళ్ళీ తెరిచారు. కానీ ఇప్పుడు కరోనా వైరెస్ భయంతో చైనాకి వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ ఫుడ్ తింటే సంసారానికి పనికిరారా?