Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరీక్షా సమయంలో పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే?

పరీక్షా సమయంలో పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే?
, మంగళవారం, 15 జులై 2014 (18:10 IST)
పరీక్షలు ఎలా రాయాలి? ఎలా చదవాలి? అనేందుకు ఎన్నో టిప్స్ ఉండొచ్చు. కానీ చదివిన పాయింట్స్ గుర్తిండిపోయేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో? ఎలాంటి ఆహారం తీసుకోవాలో పిల్లలకు తెలియక తికమకపడుతుంటారు. అలాంటప్పుడు పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే చదివిన విషయాలు అలాగే జ్ఞాపకం ఉంటాయంటే.. ఈ స్టోరి చదవండి. 
 
పిల్లలు పరీక్షా సమయంలో ఒకింత ఒత్తిడికి లోనవుతారు. ఎక్కువ సేపు నిద్రపోరు. చదవటానికే అధిక సమయం కేటాయిస్తారు. అలాంటి సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాల్సి వుంటుంది. జీర్ణంకాని ఆహార పదార్థాలతో తక్కువగా నిద్రపోవడం ద్వారా అజీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత ఎక్కువగా నూనె వాడిన పదార్థాలు, కారం, మసాలాతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. 
 
అందుచేత పరీక్షా సమయంలో ఉదయం పూట ఆరెంజ్, ద్రాక్ష, పుచ్చకాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఆ తర్వాత రాగి జావ, ఓట్స్ జావ, గోధుమ, మొక్కజొన్న, సజ్జలతో చేసిన జావల్ని తీసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట పప్పు, ఆకుకూరల్ని తీసుకోవాలి. రాత్రిపూట అరటిపండు, బొప్పాయి, ఆపిల్ పండ్లను సలాడ్స్ రూపంలో ఇవ్వొచ్చు. చదువుకుంటున్నప్పుడు ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు. ఖర్జూరం, బాదం పప్పల్ని రోజుకు మూడేసి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu