Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు?

పిల్లల చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు?
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:46 IST)
పిల్లల చర్మం చాలా మృదువైనది. అయితే ప్రస్తుతం కాలుష్యం అధికంగా ఉండటంతో ముఖంలో మట్టి చేరకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు కాసింత చల్లని నీటితో ముఖం కడుగుతూ ఉండాలి. వింటర్‌లో ఏర్పడే దురద వంటి అలెర్జీలకు వైద్యుల సలహా మేరకు క్రీమ్‌లు వాడొచ్చు. అలాగే ఇంట్లో దోమలుంటే అలెర్జీ ఏర్పడటం ఖాయం. అందుచేత దోమల బారి నుంచి పిల్లలు తప్పుకునేందుకు వీలుగా మాశ్చరైజింగ్ క్రీమ్‌లు వాడటం మంచిది.

ఇంకా సీజన్ వారీగా పిల్లల్లో ఏర్పడే అలెర్జీలకు క్రీమ్‌లను కూడా వైద్యుల సలహాల మేరకే వాడాలి. ఎప్పుడూ హాట్ వాటర్‌లో స్నానం చేయించడం.. అప్పుడప్పుడు ముఖం కడగడం.. పరిశుభ్రమైన దుస్తులను తొడగడం.. శుభ్రతతో కూడిన ఆహారాన్ని పెట్టడం వంటివి చేస్తే.. అలెర్జీలు ఏమాత్రం దరిచేరవు. 
 
ఎక్కువ వేడి లేదా కోల్డ్ వాటర్ కంటే గోరువెచ్చని లేదా మితమైన ఐస్, హాట్ వాటర్‌ను పిల్లల స్నానానికి, ఫేస్‌ వాష్‌లకు ఎంచుకోవచ్చు. పిల్లలకంటూ ప్రత్యేకంగా టవల్స్ వాడటం చేయాలి. స్కూల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేటప్పుడు ఒకే కాటన్‌ను ఉపయోగించకుండా చూసుకోవాలి. మేకప్ వస్తువులు కూడా ఇతరులు ఉపయోగించినవి.. పిల్లలు వాడకుండా చూసుకోవాలి. ఎక్కువ సేపు మేకప్ అలానే ఉంచకూడదు. 
 
ఇక విటమిన్ లోపాల కారణంగానూ అలెర్జీలు ఏర్పడతాయి. అందుచేత విటమిన్-ఎతో కూడిన స్వీట్ పొటాటో, క్యారెట్లు, నట్స్, ఎండు అప్రికోట్స్, దోసకాయ, క్యాప్సికమ్, టునా ఫిష్, మామిడి వంటివి పిల్లల డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే 18 ఏళ్ల నిండేంత వరకు పిల్లలను బ్యూటీపార్లర్ వైపు వెళ్లనివ్వకండి. అక్కడ వాడే రసాయనాలతో పిల్లల చర్మానికి హాని కలుగవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu