ఏఐ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి ఎన్నో చిత్రవిచిత్రాలను సృష్టించేస్తున్నారు. కొందరైతే వారు క్రియేట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ టాలెంట్ ఏమిటో చూపిస్తున్నారు. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది.
వీడియోలో చూపించినదేమిటంటే... ఆకాశంలో విమాన ఎగురుతున్న సమయంలో ప్రమాదానికి లోనవుతుంది. అప్పుడు అందులో నుంచి తన పాపాయిని సముద్రంలోకి జారవిడుస్తుంది ఓ తల్లి. మరో వైపు ఓ యువతి తను పెంపుడు పిల్లిని కిటికీలో నుంచి కిందకి వదిలేస్తుంది. అటు పాపాయి, ఇటు పిల్లి రెండూ సముద్రంలో పడిపోతాయి. అక్కడ్నుంచి పాపాయిని పిల్లి రక్షించి ఒడ్డుకు చేర్చుతుంది. పాపాయికి సపర్యలు చేస్తుంది. ఇంతలో రెస్క్యూ టీం వచ్చి వీరిని చూసి సురక్షితంగా తీసుకుని వెళతారు. చూడండి ఆ వీడియో...