Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల అల్లరి శ్రుతిమించకుండా చూసుకోండి.. లేకుంటే ప్రమాదమే!

Advertiesment
Kids
చిన్నపిల్లల నడకలు, మురిపించే మాటలు, అల్లరి ఎంత సంతోషాన్నికలిగిస్తాయి. ఎంత టెన్షన్‌గా ఉన్నా పిల్లల అల్లరి మనకి ఉత్తేజాన్నికలిగిస్తుంది. కాని ఆ అల్లరి పరిమితి మించితే ప్రమాదమే! వారిని అదుపుచేయడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్నిఅతిగారాబం చేస్తుంటారు. పిల్లలు తప్పు చేస్తే వెనకేసుకొస్తుంటారు. ముందంతా వారి అల్లరిని ఉత్సాహపరిచి చివరిలో మాత్రం అదంతా సరికాదని అడ్డుపడినా వారికి అర్థం కాకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వారి అల్లరి మితిమీరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
పిల్లలు ఇంట్లో ఉన్నప్పటికంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. అలాంటి సమయాల్లో పిల్లల మీద తల్లిదండ్రులు కోప్పడలేరు, ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి పరిస్థితినుంచి తప్పించుకోవాలంటే పిల్లలకు ముందుగానే బయటికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియజేయాలి. పద్ధతిగా ఉన్నప్పుడూ, వారి ఆటలూ, అల్లరి హద్దులు దాటనప్పుడు మాత్రమే మంచి పిల్లలుగా గుర్తింపు పొందుతారని చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu