Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలతో తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితులుగా మెలగండి!

పిల్లలతో తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితులుగా మెలగండి!
, శుక్రవారం, 18 డిశెంబరు 2015 (12:55 IST)
పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్నిశక్తివంతులుగా తయారుచేయాలనే కోరికతో పిల్లల్నిఅనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వారు తాము జీవితంలో ఏమి సాధించలేని విషయాలను తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అత్యంత కఠినంగా కూడా ప్రవర్తిస్తారు. మరికొందరు తల్లిదండ్రులు తమ చాలా గారాబంతో తమ పిల్లల్ని ఈ లోకంలో అప్రయోజకులుగా చేస్తున్నారు. ప్రతి పిల్లలకు ఒక్కో స్థాయిలో శ్రద్ధ, ప్రేమ, క్రమశిక్షణ అవసరమవుతాయి. 
 
పిల్లలు సరిగ్గా ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సమకూర్చడంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మీ అంతరంగంలోనూ, మీ ఇంట్లోనూ ఆనందం, ప్రేమ, భద్రత, క్రమశిక్షణలతో కూడిన వాతావరణాన్నికల్పించుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. తల్లిదండ్రులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు నలుగురు సంతానం ఉంటే నలుగురు ఒకేలా ఉండరు. నలుగురి మనస్తత్వం వేర్వేరుగా ఉంటుంది. మీరు చేయవలసినదల్లా పిల్లల ఎదుగుదలకు కావలిసిన ప్రేమ, సహాయం అందజేయడమే. పిల్లల తెలివితేటలు సహజంగా ఎదగడానికి ప్రేమపూర్వకమైన వాతావరణాన్నికల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. మీ పిల్లల జీవితము చాలా నిర్మలమైనది, స్వచ్ఛమైనది.
 
తల్లిదండ్రులు ఉదయాన్నేపిల్లల్నిస్కూలుకు వెళ్ళేటప్పుడు చాలా తొందరపెడుతుంటారు. కారణం పిల్లలు టైమ్‌కి అన్నీ చేయాలని, క్రమశిక్షణగా ఉండాలని, మంచి పిల్లలు అనిపించుకోవాలని వాళ్ళ తాపత్రేయం. అన్నీటైమ్ టేబుల్ ప్రకారం జరగాలనుకునే మీరు మీ పిల్లలకు ఎప్పుడైనా టైమ్ ఆఫ్ ఇచ్చారా? చదవడానికి, రాయడానికి మాత్రమే కాదు మీతో మాట్లాడానికి, ఆట్లాడానికి కబుర్లు చెప్పడానికి మీ టైమ్ టేబుల్‌లో సమయం ఎక్కడ కేటాయించారని ఆలోచించండి. ఇప్పుడున్న పిల్లలకు ఈ పసితనం ఈ స్కూల్ టైమ్‌ల వల్ల ఎప్పుడో మాయం అయిపోయింది. 
 
పిల్లలు అన్నిపనుల్లో సక్రమంగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పిల్లలు తప్పుచేస్తే మొదట తప్పుపట్టేది తల్లినే. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచడం మంచిదే కాని క్రమశిక్షణ మితిమీరితే చాలా ప్రమాదకరం. పిల్లలకి తిరిగి చూసుకుంటే పసితనపు గుర్తులేవీ. అందుకే ఎప్పుడూ కాకపోయిన ఎప్పుడో ఒకసారి వారిని రొటీన్ లైఫ్ నుంచి బయటపడనివ్వండి. మెల్లగా లేవనివ్వండి, హాయిగా ఆడుకొనివ్వండి, ఒక విషయం వద్దు అనే ముందు ఎందుకు వద్దో వివరించండి. ఒకవేళ వారు మీ వాదన కాదని వారి మాట చెప్తే, అందులో నిజం ఉంటే, వారి ఆలోచనకి విలువ ఇవ్వండి. 
 
అప్పుడు పెద్దయ్యాక కూడా ఈ సంభాషించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. లేకపోతే చిన్నప్పుడు మీరు చెప్పింది వింటారు పెద్దయ్యాక వాళ్లమాటే నెగ్గేలా చూసుకుంటారు. పసితనం మహా అయితే ఒక నాలుగైదేళ్లు ఉంటుంది, వారి జీవితంలోని ఆ కాస్త సమయం వారికిచ్చేయ్యండి మంచి చెడు చెప్పండి, మంచెదో చెడేదో మీరే డిసైడ్ చేయకండి. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులులా కాకుండా స్నేహితులుగా మెలగండి.

Share this Story:

Follow Webdunia telugu