Publish Date: Wed, 31 Dec 2014 (18:24 IST)
Updated Date: Wed, 31 Dec 2014 (18:28 IST)
పిల్లలు ఏదైనా మంచిపనిచేస్తే ప్రోత్సహించండి. కానీ అతిగా పొగిడేయకండి. ప్రతీ చిన్నపనికి మంచి పనిచేశావ్ అంటూ జడ్జ్ చేసేయకండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లల పనులకు చిన్న చిన్న బహుమతులివ్వాలే కాని వారిని వారు చేసే పనులని ఆధారంగా తీసుకుని జడ్జ్ చేయకూడదని వారు సలహా ఇస్తున్నారు.
సాధారణంగా ఒక వ్యక్తిని తను చేసిన ఏదైనా పని గురించి పొగిడితే ఆ వ్యక్తి తన పనిపై ఆసక్తి పోగొట్టుకుంటాడని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇదే అంశం పిల్లలకూ వర్తిస్తుంది. పిల్లలని అతిగా ప్రశంసించే ముందు ఆ ప్రశంస పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపబోతుందనే అంశంపై ఆలోచించాల్సి వుంటుంది.
తాజా అధ్యయనాల ప్రకారం పిల్లల్ని పొగడడం వల్ల వారు చేసే పనిపై వారి మీద మరింత ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా ఇష్టంగా చేయవలసిన పనిని వారు కష్టంగా భావించి పూర్తి చేస్తారు. అతి పొగడ్తలతో పిల్లలు రిస్క్ తీసుకోవడంపై వెనుకంజ వేస్తారని చైల్డ్ కేర్ నిపుణులు సెలవిస్తున్నారు.
Selvi
Publish Date: Wed, 31 Dec 2014 (18:24 IST)
Updated Date: Wed, 31 Dec 2014 (18:28 IST)