Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లల్ని స్కూలుకు పంపుతున్నారా? ప్రేమతో ఓ ముద్దు.. ఆప్యాయతగా ఓ హగ్ చేసుకోండి!

పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచిపోయాయి. అయినా మీ పిల్లలు స్కూళ్లకు వెళ్లనంటూ మారాం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. వేసవి సెలవుల్లో ఇంట్లోనే ఉండి అలవాటైన చిన్నారులకు.. పాఠశాలలు పునఃప్రారంభం కాగాన

పిల్లల్ని స్కూలుకు పంపుతున్నారా? ప్రేమతో ఓ ముద్దు.. ఆప్యాయతగా ఓ హగ్ చేసుకోండి!
, సోమవారం, 4 జులై 2016 (12:49 IST)
పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచిపోయాయి. అయినా మీ పిల్లలు స్కూళ్లకు వెళ్లనంటూ మారాం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. వేసవి సెలవుల్లో ఇంట్లోనే ఉండి అలవాటైన చిన్నారులకు.. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఒత్తిడికి గురవుతారు. తల్లిదండ్రులను వదిలిపెట్టి.. కొన్ని గంటలపాటు ఉండటాన్ని పిల్లలు అంత సులభంగా అంగీకరించరు.

అయితే స్కూళ్ల పట్ల పిల్లల్లో ఉండే భయాన్ని పోగొట్టగలిగితే.. పిల్లల్లో ఒత్తిడిని దూరం చేయడం చాలా సులభమైన పనంటూ చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పాఠశాల వాతావరణం గురించి పిల్లలకు పాజిటివ్‌గా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. పాఠశాలల్లో ఆడుకోవచ్చు. నీతోటి విద్యార్థులందరూ నీ స్నేహితులే.. భయపడక్కర్లేదంటూ వారికి నచ్చజెప్పాలి. 
 
అమ్మ చెప్పే ఏ విషయమైనా అది నిజమని పిల్లలు నమ్ముతారు. అందుకే స్కూళ్ల పట్ల తల్లిదండ్రులు పాజిటివ్ టాక్‌తో పిల్లలకు చెప్పగలగాలి. స్కూలుకు ఎందుకెళ్లాలి? చదువుకోవడం ద్వారా ప్రయోజనాలేంటి? అనే విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వేసవి తర్వాత స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు కొత్తగా స్కూళ్లల్లో చేర్పించే చిన్నారుల పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. తొలిసారిగా స్కూళ్లకు వెళ్లే చిన్నారులు భయపడతారు. ఆ వాతావరణం వారికి అలవాటుండదు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే...?
 
* స్కూలుకు వెళ్లే ముందు రోజు రాత్రి సమయానికి నిద్రపుచ్చాలి. మరుసటి రోజు ఉదయం సరైన సమయానికి నిద్రలేపి.. స్కూలుకు రెడీ చేయించాలి. స్కూలుకు రెడీ అయ్యాక దేవుడి ప్రార్థనను అలవాటు చేయాలి. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. 
 
* పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ముందుగా ప్రేమతో ఓ ముద్దివ్వాలి. ఆప్యాయతగా హగ్ చేసుకోవాలి. టాటా బై చెప్పి.. పంపాలి. టాటా బై చెప్పాక చిన్నారులకు కనిపించేలా నిల్చుని ఉండకూడదు. అలా చేస్తే.. చిన్నారులు మిమ్మల్ని చూసి క్లాస్ రూమ్‌లకు వెళ్ళకుండా మారాం చేసే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుతుక్రమ రుగ్మతలకు చెక్ పెట్టాలంటే.. 2 నుంచి 3 సార్లు అల్లం టీ తాగండి!