Publish Date: Mon, 22 Jun 2015 (17:58 IST)
Updated Date: Mon, 22 Jun 2015 (18:00 IST)
పిల్లలకు తల్లిపాలు శ్రేష్ఠం. పెరిగే పిల్లలకు అమ్మపాలుతో పాటు పాలతో తయారైన ఆహార పదార్థాలు ఇవ్వడం ఆరు నెలలకు తర్వాత ప్రారంభించవచ్చు. బియ్యం, బార్లీ, గోధుమలు, ఓట్స్ వంటివి ఒక సంవత్సరం నుంచి మెల్లమెల్లగా మొదలెట్టొచ్చు. పెరిగే పిల్లల్లో పావు కప్పు కోడిగుడ్డు, చేపలు ఇవ్వడం మొదలెట్టాలి. పాలు, చీజ్, పెరుగును తప్పకుండా పిల్లల డైట్‌లో చేర్చాలి. ఇవి పిల్లల్లో ఎముకల బలాన్ని మరింత పెంచవచ్చు.
పుట్టిన సంవత్సరం నుంచి పప్పుతో చేసిన వంటకాలు తినిపించవచ్చు. వారానికి రెండు సార్లు చేపలు.. వీలైతే వారానికి ఒకసారి మటన్ సూప్, చికెన్ సూప్ వంటివి అలవాటు చేయాలి. పండ్లను పంచదార కలపని జ్యూస్ రూపంలో లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా.. అదీ కాకుంటే.. స్మూతీల్లా ఇవ్వడం చేయాలి.
సంవత్సరం పాటు వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని ఇవ్వడం చేయాలి. తల్లిపాలు కనీసం నాలుగు నెలలైనా ఇవ్వాలి. తద్వారా పిల్లలు సులభంగా పెరుగుతారు. ఆరో నెల నుంచి ఉడికించి బ్లెండ్ చేసిన పొటాటో, కేరెట్, ఆపిల్, అరటి పండు వంటివి ఇవ్వాలి. అటు పిమ్మట బాగా బ్లెండ్ చేసిన పప్పుతో కలిపిన అన్నం, చికెన్ వంటివి ఇవ్వాలి. మాంసాహారాలను రాత్రిపూట మాత్రం ఇవ్వకూడదు. పగటిపూట మాంసాహారాన్ని ఇవ్వాలి. రాత్రి పూట ఇడ్లీలు వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వడం ఉత్తమం.
Selvi
Publish Date: Mon, 22 Jun 2015 (17:58 IST)
Updated Date: Mon, 22 Jun 2015 (18:00 IST)