ఈ చాక్‌పీస్‌లను పిల్లలు వాడితే.. చేతులు ఇట్టే శుభ్రమవుతాయ్ తెలుసా?
సావ్లాన్ అనే స్వచ్ఛంధ సంస్థ పిల్లలు ఉపయోగించే చాక్ పీస్‌ల ద్వారా చేతులను శుభ్రం చేస్తుంది. ఎలాగంటే.. చాక్ పీసులను వాడితే చేతులకు పౌడర్ అంటుకుంటుంది. అందుకే చాక్ పీస్‌లను ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్
మట్టిలో ఆడుకోవడం అనేది పిల్లలకు చాలా ఇష్టం. శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆహారం తీసుకునేస్తుంటారు. చేతులు పరిశుభ్రంగా లేకపోవడం ద్వారా డయేరియా, న్యుమోనియా వంటి అనేక వ్యాధులు పిల్లలకు వస్తున్నాయి. ఆ కారణంగా ఏటా 18 లక్షల మంది మృతి చెందుతున్నారని వైద్యులు చెప్తున్నారు.
పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత లేకుంటే ఏ పని చేసినా.. ఆహారం తీసుకునే ముందు పిల్లలు చేయిని శుభ్రం చేసుకోవాలని.. అలా చేస్తే అనేక వ్యాధుల నుంచి పిల్లలను రక్షించిన వారవుతామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే సావ్లాన్ అనే స్వచ్ఛంధ సంస్థ పిల్లలు ఉపయోగించే చాక్ పీస్‌ల ద్వారా చేతులను శుభ్రం చేస్తుంది. ఎలాగంటే.. చాక్ పీసులను వాడితే చేతులకు పౌడర్ అంటుకుంటుంది. అందుకే చాక్ పీస్‌లను ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడిగేయాల్సి వస్తుంది. అయితే సావ్లాన్ ఏం చేసిందంటే వారు వాడే చాక్ పీసులనే శానిటరీ ఉత్పత్తిగా తయారు చేసింది.
ఈ సంస్థ తయారు చేసే చాక్ పీసులు వాడినంత సేపు పలకపై రాస్తాయి. అయితే వాడకం పూర్తయ్యాక మాత్రం చేయి కడిగేందుకు వెళ్తే.. అందులో శానిటరీ.. నురుగుగా మారి చేతులను శుభ్రం చేసేస్తుంది. సావ్లాన్ సంస్థ ప్రస్తుతం అలాంటి చాక్ పీస్‌లను దాదాపుగా 3 లక్షల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ చాక్ పీసులు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయని సావ్లాన్ సంస్థ వెల్లడించింది.