Publish Date: Thu, 23 Apr 2015 (14:37 IST)
Updated Date: Thu, 23 Apr 2015 (14:40 IST)
పిల్లలకు చిన్న చిన్న పనులు చేసే విధంగా అలవాటు చేయాలి. ఇంటి పనిలో పిల్లలకు తగిన పనుల్ని వారిచేత చేయించే ప్రయత్నం చేయించాలి. చాలామంది మహిళలు భర్తకు, పిల్లలకు బాత్ రూమ్‌లో స్నానాలకు నీళ్ళు పెట్టడం, సబ్బులు, తువ్వాళ్ళు అందంచడం, దుస్తులు రెడీ చేయడం, టిపిన్లు, నోటికో, చేతికో అందించడం వంటి సేవలు చేసేస్తుంటాకు. దాంతో పిల్లల్లో కష్టపడే తత్త్వం అలవడదు.
పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా అమ్మ కోసమో, బామ్మ కోసమో చూస్తుంటారు. ఈ తరం పిల్లలైతే అమ్మ, బామ్మ, సరసన నాన్నను కూడా చేరుస్తారు. అందుచేత ఇలా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచడం మంచి పద్ధతి కాదు.
అందుచేత మీ శ్రమలో పాలుపంచుకునేలా పిల్లల్ని పెంచాలి. పని చేయమని నెమ్మదిగా చెప్పాలి. టిఫిన్స్ తీసి లంచ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం, యూనిఫామ్స్, బుక్స్ రాత్రిపూటే రెడీగా పెట్టుకోవడం.. అన్నం వారంతట వారే తినే విధంగా అలవాటు చేయడం ద్వారా కొంచెం శ్రమ తగ్గుతుంది. పిల్లలకూ కష్టమేమిటో అర్థమవుతుంది.
Selvi
Publish Date: Thu, 23 Apr 2015 (14:37 IST)
Updated Date: Thu, 23 Apr 2015 (14:40 IST)