Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బేబీ డైట్‌లో తేనె ఎందుకు చేర్చాలి? పిల్లల్లో ఎనర్జీ లెవల్స్ పెంచాలంటే?

బేబీ డైట్‌లో తేనె ఎందుకు చేర్చాలి? పిల్లల్లో ఎనర్జీ లెవల్స్ పెంచాలంటే?
, బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:47 IST)
బేబీ డైట్‌లో తేనె చేర్చడం ద్వారా పిల్లల్లో ఎనర్జీ లెవల్స్‌ను పెంచినట్లవుతుంది. తేనె ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మరియు సుక్రోస్ నుండి తయారవుతుంది. నార్మల్ షుగర్స్‌లో సుక్రోస్, గ్లూకోస్ కలిగి ఉంటుంది. ఇది చాలా త్వరగా జీర్ణం అవుతుంది. అందువల్ల ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది.

అయితే తేనెలో ఉండే ఫ్రక్టోజ్ అంత త్వరగా జీర్ణం కాదు కాబట్టి, ఇది ఎనర్జీగా నిలకడగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, పిల్లల్లో తక్కువ ఎనర్జీ లెవల్స్ కలిగిన వారికి తేనె ఒక ఉత్తమ ఆహారమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
అలాగే పిల్లలు ఎదగడానికి అవసరం అయ్యే విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు, తేనెలో ఉండే అమినో యాసిడ్స్ పెరిగే పిల్లల్లో శారీర పెరుగుదలకు ఎక్కువగా సహాయపడుతాయి. తేనెలో కాలేయంను రక్షించే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్ల డైట్‌లో దీన్ని చేర్చడం ఉత్తమం. ఇక తేనె పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. 
 
పిల్లలు తరచూ దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. దగ్గు వల్ల పిల్లల్లో నిద్రలోపిస్తుంది. కాబట్టి, తేనెలో దగ్గు నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కీమోథెరఫికి గురైన పిల్లల్లో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తక్కువగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu