Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు చెప్పకుండానే హోంవర్క్ చేయాలంటే?

పిల్లలు చెప్పకుండానే హోంవర్క్ చేయాలంటే?
, శుక్రవారం, 21 నవంబరు 2014 (17:02 IST)
పాఠశాల వచ్చి రాగానే పుస్తకాలు ముందేసుకుని కూర్చుని హోం వర్క్ చేయమనడం సరికాదు. రాగానే పిల్లల స్కూలు విశేషాలను అడిగి తెలుసుకుంటూ ముందు వారికి శక్తినిచ్చే ఆహారాన్ని అందివ్వండి. ఎందుకుంటే మధ్యాహ్నం తిన్న ఆహారం ఇంటికొచ్చేటప్పటికీ అరిగిపోయి ఉంటుంది. దాంతో వాళ్లలో నిస్సత్తువ చేరి క్షణం కూడా చదువుపై దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. 
 
అలాంటప్పుడు చిన్నారుల దినచర్యను ఏ వారానికి ఆ వారం మీరే నిర్ణయించి ఓ ప్రణాళిక సిద్ధం చేసి, ఛార్ట్‌పై గీసి గోడకు అతికించండి. అలాగనీ ప్రతీది యాంత్రికం చేయకూడదు. పిల్లలు ఏ సమయంలో ఏం చేయాలనుకుంటున్నారో కనుక్కొని ఆ సమయంలో చెప్పకుండానే హోం వర్క్ పూర్తి చేసేలా ప్రోత్సహించండి. అది అలవాటయ్యేలా చూడండి. 
 
హోం వర్క్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అర్థం కాకుంటే చెప్పండి. కుదరకపోతే ట్యూషన్ పెట్టించాలి. టీవీ చూడడం, ఆటలాడటాన్ని కూడా ప్రోత్సహించాలి. వీటి కోసమూ సమయం కేటాయిస్తూనే.. హోం వర్క్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా చెప్పాలి. 
 
బాగా చదవాలన్న ఉద్దేశంతో తరచూ పిల్లల్ని ముందేసుకుని కూర్చోమనడం సరికాదు. కాసేపు చదివినా దాన్ని ఒంటపట్టించుకుంటున్నారో లేదో గమనించుకోవాలి. ఏకాగ్రతతో చదివేలా సూచనలు చేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu