Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలకు 20 నిమిషాల్లోపే అన్నం తినిపించాలి!

పిల్లలకు 20 నిమిషాల్లోపే అన్నం తినిపించాలి!
, బుధవారం, 3 డిశెంబరు 2014 (16:27 IST)
పిల్లలకు 20 నిమిషాల్లోపే అన్నం తినిపించాలి. ఆకలేసినప్పుడే అన్నం పెడితే వారు సరిగా తినరు. ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతి పది నిమిషాలకూ వారి దృష్టి వేరే వాటిమీదికి మళ్లిపోతుంటుంది. 
 
తిండి విషయంలో పిల్లల్ని వారి స్నేహితులతో పోల్చవద్దు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల స్నేహితులు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మరీ మంచిది. అలా చేస్తే ఫుడ్‌కి సంబంధించి పిల్లల ఇష్టాయిష్టాలు ఏమిటో తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది. 
 
అన్నం తింటే నీకు చాక్లెట్ పెడతాను. బిస్కెట్ ఇస్తాను అని పిల్లల్ని ఆశపెట్టడం మంచి పద్ధతి కాదు. మెనూ ప్లానింగ్‌లో పిల్లలు పాలుపంచుకునేలా చేయాలి. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వారికి ఇష్టం. ఎలాంటివి వారికి ఇష్టం లేదో తెలుసుకుని తదనుగుణంగా మెనూ టైమ్‌టేబుల్‌ని తయారు చేసి పిల్లలకు పెట్టాలి. 
 
పోషకాహార లోపం ఉన్న పిల్లలు దేన్నీ తినడానికి తొందరగా ఇష్టపడరు. అలాంటి వారికి తగిన సప్లిమెంట్లు ఇప్పించాలి. అప్పుడు వారిలో పోషకాహార లోపం సమస్య పోయి ఆకలి వేయడం, తిండి పట్ల ఆసక్తి రెండూ పెరుగుతాయి. 
 
అన్నం తినే వేళలు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఒకేసారి పిల్లలకు ఎక్కువ అన్నం పెట్టేయకుండా మితంగా పెట్టాలి. పిల్లవాని బొజ్జలో ఒక దఫా 250 ఎంఎల్ కన్నా మించి ఎక్కువ ఆహారం పోదు. 
 
పోషకాహారం పుష్కలంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. ఇలా చేస్తే పోషకాహార లోపం రాదు. చికెన్, డ్రైఫ్రూట్స్, మిల్క్ షేక్స్, నట్ హల్వా, నువ్వుల లడ్డు, పీ నట్స్ చల్లిన, వెన్న పూసిన చపాతీలు, ఎగ్ ఆమ్లెట్ కలిపిన చపాతీలు, దోసె వంటివి పిల్లలకు పెట్టాలి. 
 
పిల్లలకు అన్నం కలిపి పెట్టొద్దు. వారికి వారే ఆహారం కలుపుకుని తినేట్టు అలవాటు చేయాలి. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, పిజ్జాలాంటివి తినొద్దని కట్టడి చేయకండి. అదే సమయంలో చాక్లెట్‌తో పాటు ఒక పండు కూడా పిల్లలచేత తినిపిస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
కుటుంబసభ్యులతో కలిసి అన్నం తినడాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu