Publish Date: Mon, 25 May 2015 (16:48 IST)
Updated Date: Mon, 25 May 2015 (16:52 IST)
పిల్లలకు ఫీడింగ్ బాటిల్స్ ఉపయోగించవద్దని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. రకరకాల ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పెదవులు, దంతాలు, నోటి అమరికలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.
రబ్బర్‌లోని కంటికి కనిపించని జెమ్స్ ద్వారా అనారోగ్య సమస్య ఏర్పడుతున్నాయి. మదర్ ఫీడ్ అయితే ఆరోగ్యదాయకమని, అదే ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పాలను ఇచ్చేటప్పుడు నాలుకు మడత పడుతుందని.. తాగిన తర్వాత శ్వాస తీసుకోవడం పిల్లలకు కష్టమవుతుంది. మదర్ ఫీడ్, కప్పుల్లో పాలు తాగే పిల్లల కంటే ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పాలు తాగే పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిసింది.
ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పిల్లలు పాలు తాగితే పాలతో పాటు గాలికూడా కడుపులోకి చేరుకుంటుంది. తద్వారా గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడుతాయి. బాటిల్స్ పాలు తాగే పిల్లలు మదర్ ఫీడ్‌కు దూరమవుతారు. పాల బుడ్డీల కంటే గ్లాసుల ద్వారా పిల్లలకు పాలు పట్టించడం మంచిది. ఫీడింగ్ బాటిల్ ద్వారా పిల్లలు పాలు తాగితే.. దవడ, దంత సమస్యలు ఏర్పడతాయి.
మాటలు సకాలంలో రావు. ఉచ్ఛారణ సరిగ్గా ఉండదు. దంత వరుసలో మార్పులుంటాయి. ఫీడింగ్ బాటిల్స్ అధికంగా ఉపయోగిస్తే.. డయేరియా వంటి సమస్యలు పిల్లల్లో ఏర్పడుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
Selvi
Publish Date: Mon, 25 May 2015 (16:48 IST)
Updated Date: Mon, 25 May 2015 (16:52 IST)