Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎదిగిన పిల్లలకు తల్లి స్పర్శలోని ఆనందం తెలియదట..అందుకే డిప్రెషన్!

ఎదిగిన పిల్లలకు తల్లి స్పర్శలోని ఆనందం తెలియదట..అందుకే డిప్రెషన్!
, సోమవారం, 18 మే 2015 (18:23 IST)
గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలు తల్లి స్పర్శతో తృప్తి చెందుతారట. అది నెలల్లో ఉన్న పిల్లలైనా సరే మూడేళ్ల పిల్లలైనా సరే.. తల్లి స్పర్శకే అభద్రతా భావం నుంచి వారిని బయటి తీసుకొచ్చే శక్తి వుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలు తల్లి దగ్గరకు చేర్చుకుని చేతులతో పొదివి పట్టుకోగానే ఏడుపు ఆపేస్తారు. అంతవరకు ఉన్న బాధ ఒక్కసారిగా అలానే మాయమవుతుంది. 
 
వాస్తవానికి స్పర్శకు బాధను పోగొట్టే శక్తి వుంది. చర్మం స్పర్శాంగం. ఇది బాధను గ్రహించినట్టే.. ఆనందాన్ని గ్రహించగలదు. నిజానికి చర్మంమీద బాధను పసిగట్టే నాడీతంతులు వున్నట్టే. ఆనందాన్ని గ్రహించి మెదడుకు చేరవేసే భాగాలు వుంటాయి. ఆ స్పర్శ కేంద్రాలను తట్టినప్పుడు లేదా నెమ్మదిగా తాకినప్పుడు ఆ సంకేతాలు మెదడుకు చేరతాయి. క్రమంగా బాధను తీసుకెళ్లే నాడుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. 
 
అందుకే పిల్లలను తల్లిదగ్గరికి తీసుకున్నప్పుడు తెలియకుండానే ఆ భాగాలమీద ఒత్తిడి పడుతుంది. ఈ కారణం చేతనే పిల్లలు ఏడుపు ఆపేస్తారు. చిన్నతనంలో తల్లిదండ్రుల స్పర్శను సరిగా అనుభవించని పిల్లల్లో ఆ నాడీకేంద్రాల మీద స్పర్శ ప్రభావం పడనందున ఎదిగిన తర్వాత స్పర్శతో ఆనందం పొందటం తెలియక సులభంగా డిప్రెషన్‌కు గురవుతారు.

Share this Story:

Follow Webdunia telugu