Publish Date: Thu, 19 Feb 2015 (18:53 IST)
Updated Date: Thu, 19 Feb 2015 (18:58 IST)
విదేశాల్లో పిల్లల పెంపకం ఎలా ఉంటుందంటే.. నార్వేలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. అయినా సరే తగిన జాగ్రత్తలు చెబుతూ పిల్లల్ని బయటకు పంపేస్తారట. వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా చేస్తారట. ఇదే కాదు.. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేట్ డేకేర్‌లు ఉంటాయి. పిల్లలకు ఏడాది వచ్చాక ప్రతి ఒక్కరినీ కొంత డబ్బు చెల్లించి కొన్నిరోజులు అక్కడ ఉంచాలి. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వాళ్లక్కడే ఉంటారు. అదీ ఎక్కువ సమయం బయటే.
ఇక వియత్నాంలో తల్లిదండ్రులకు పిల్లలకు తొమ్మిదినెలలు వచ్చేసరికి న్యాపీ చేయడం మానేస్తారు. పిల్లలు తమ బాత్రూం అవసరాన్ని తెలియజేసేలా చిన్నగా ఈలవేయడం నేర్పిస్తారు. ఈల శబ్ధం వినిపించగానే వాళ్లను బాత్రూంకి తీసుకెళ్తారు.
పిల్లలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. వాళ్లను వీలైనంత వరకు ఎక్కువ సేపు ఆరుబయట ఉంచాలని పరిశోధకులు అంటున్నారు. ఇంట్లో ఉండనివ్వడం, ఏసీలకు బాగా అలవాటు చేయడం వంటివి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఆరు బయట ఉంచడం ద్వారా చిన్నారులకు తాజా గాలి అందుతుందని... అది వాళ్ల గుండెకూ, ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
పారెంట్స్ ఆఫీసుకు వెళ్లొచ్చాక పిల్లల్ని ఆరుబయట ఆడుకోనివ్వడం.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఆడుకోవడం చేయాలి. ఒంటరిగా బయటకు వెళ్లే స్వేచ్ఛను ఇస్తూనే జాగ్రత్తలు కూడా చెప్పాలి. విదేశాల్లో పిల్లలకు ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తారు. నాలుగేళ్లకే పిల్లలు వాళ్లంతట వాళ్లు బయటకు వెళ్లేలా ధైర్యాన్ని కల్పిస్తారు. ఒంటరిగా స్కూల్స్‌కు వెళ్లేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు.
Selvi
Publish Date: Thu, 19 Feb 2015 (18:53 IST)
Updated Date: Thu, 19 Feb 2015 (18:58 IST)