Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాపాయి పాకుతుంటే ఏం చేయాలో తెలుసుకోండి.!

Advertiesment
Child care tips
పాపాయి పాకుతుంటే.. ఏం చేయాలో తెలుసుకోవాలా.. అయితే ఈ స్టోరీ చదవండి. చిన్నారులు పాకడం మొదలెట్టారంటే వాళ్లని పట్టుకోలేం. హుషారుగా ఇల్లంతా పాకుతూ ఉంటారు. వారి చర్యలు ఆనందంగా అనిపించొచ్చు కానీ.. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అందుకే ఏం చేయాలంటే..?
 
ప్రతిరోజూ రెండు పూటలా ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి తుడవాలి. పిల్లలు పాకడానికి వీలుగా ఇంట్లో కనీసం ఒక గదినైనా ఖాళీగా ఉంచాలి. లేదంటే ఏవయినా అడ్డొస్తే దెబ్బలు తగలడం, గాయాలు కావడం వంటివి జరుగుతాయి. 
 
అలాగే చిన్నారులు నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. వీలైతే చేతులకు వస్త్రంతో చేసిన గ్లవుజులు తొడిగితే మంచిది. ఎప్పటికప్పుడు వారి చేతుల్ని శుభ్రంగా కడుగుతుండాలి. 
 
నేలమీద చిన్న చిన్న వస్తువులు, రాళ్లు, పూసలు, దుస్తుల మీద కుట్టే అద్దాల వంటివి ఉండకుండా చూసుకోవాలి. ఇవి వుంటే పిల్లలు నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది. సబ్బులు, పేస్టులు, రసాయనాలు చేతికందే విధంగా పెట్టకుండా చూసుకోవాలి. 
 
బాత్రూమ్ తలుపులు మూసివుంచాలి. మాత్రలు ఎత్తులో పెట్టాలి. వంటగదిలో చాకులూ, వేడి పాత్రలూ కింద పెట్టకూడదు. కరెంట్ తీగలు వేలాడకుండా చూసుకోవాలి.  మొనతేలిన టీపాయ్‌లూ, బల్లలూ ఉంటే తీసేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu