Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పిల్లలు పళ్లు ఎలా తోముతున్నారో చూస్తున్నారా...?!!

Advertiesment
Brushing
, సోమవారం, 21 మార్చి 2016 (09:05 IST)
పిల్లల్లో ఆరు నెలల వయసులో దంతాలు రావడం మొదలై, ఒక సంవత్సరానికి మొత్తం పళ్లు వచ్చేస్తుంది. ఇలా వచ్చినవి 6 - 12 ఏళ్ల వరకూ ఉంటాయి. 6 - 12 ఏళ్ల మధ్యలో పాలపళ్లు ఒక్కొక్కటీ ఊడిపోతూ శాశ్వత దంతాలు వస్తాయి. 
 
పళ్లు వచ్చిన నాటి నుంచే బ్రష్ చేయడం మొదలుపెట్టాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండుమూడు నిమిషాలు దంతాల పైనుంచి కిందకు, పైకి కదుపుతూ బ్రషింగ్ చేయించాలి. చిగుళ్లు దెబ్బతినకుండా పేస్ట్ తినకుండా, బ్రష్ నమలకుండా జాగ్రత్త పడాలి. 45 రోజులకోసారి బ్రష్ మార్చాలి.
 
పిల్లలకు రెండుమూడు సంవత్సరాలు ఉన్నప్పుడే డెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. అక్కడి పరికరాలు, డెంటల్‌‍కు సంబంధించిన జాగ్రత్తలను వారు డెంటల్ ప్రాధాన్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకోసారి డెంటల్ చెకప్‌కి తీసుకెళుతుండాలి.
 
చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ పళ్లు పుచ్చిపోవడం చూస్తుంటాం. ఈ సమస్య చాక్లెట్లు, స్వీట్లు తీసుకోవడం ఆ తర్వాత శుభ్రపరుచుకోవడం, సరిగ్గా బ్రషింగ్ చేసుకోకపోవడం వల్ల వస్తాయి. తల్లిదండ్రులు పిల్లల దంతాలపై నల్లటి డాట్స్ ఏమైనా ఉన్నాయేమో గమనించి చికిత్సి ఇప్పించాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆ నల్లటి మచ్చ రంధ్రంగా మారడం, నొప్పి పెట్టడం జరుగుతుంది. 
 
పాలపళ్లు ఊడి, శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు సాధారణంగా చిగుళ్లు వాయడం, నొప్పి ఉండటం జరుగుతుంది. ఇలాంటప్పుడు బ్రషింగ్ చేసుకోరు. నోరు శుభ్రంగా లేకపోతే దంతసమస్యలు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu