Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల్ని సంరక్షణ కేంద్రం చేర్చే ముందు ఏం చేయాలంటే?

Advertiesment
Best ways for kids to start daycare?
, గురువారం, 12 ఫిబ్రవరి 2015 (16:49 IST)
పిల్లల్ని సంరక్షణ కేంద్రంలో ఉంచి, ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కానీ క్రీచ్‌లో పిల్లల్ని చేర్చేందుకు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. సంరక్షులు ఎలా ఉన్నారని తెలుసుకోండి. ప్రతి నలుగురు చిన్నారులకు ఓ కేర్ టేకర్ ఉంటే బెస్ట్. అదే ఆరేడుగురు పిల్లల సంరక్షణ ఒకరు చూస్తుంటే.. మీ చిన్నారిపై సరైన శ్రద్ధ చూపించలేకపోవచ్చు. 
 
పిల్లల్ని ఆడించే గది పరిమాణాన్నీ చుట్టుపక్కల పరిసరాల్ని కూడా తప్పనిసరిగా చూసుకోండి. గది మరీ చిన్నదిగా ఉండి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మీ చిన్నారి అసౌకర్యానికి గురవచ్చు. అలాగే పిల్లల్ని పడుకోబెట్టడానికి వాడే మంచాలూ.. బాత్రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయా చూసుకోండి. 
 
అలాగే మీరు చేర్చే పిల్లల సంరక్షణ కేంద్రానికి ప్రభుత్వ పరంగా లైసెన్స్, అవసరమైన అనుమతులూ గుర్తింపూ ఉన్నాయో లేదో పరిశీలించండి. దాని నిర్వాహకుల మంచి చెడ్డలూ ఆరా తీయండి. ఇవన్నీ మీ పిల్లల భద్రతకు ప్రాథమిక చర్యలుగా గుర్తించండి. 
 
బొమ్మలూ, వాటి పరిశుభ్రత, నాణ్యత కూడా చూడాలి. బొమ్మలు శుభ్రంగా లేకపోతే దానివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Share this Story:

Follow Webdunia telugu