Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలకు వేసవిలో ఆటలొద్దు.. బర్గర్లొద్దు.. పండ్లే ముద్దు!

పిల్లలకు వేసవిలో ఆటలొద్దు.. బర్గర్లొద్దు.. పండ్లే ముద్దు!
, శుక్రవారం, 22 మే 2015 (15:33 IST)
మండుతున్న వేసవిలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల్ని ఎండల్లో ఆడనివ్వకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు పండ్ల రసాలు ఇవ్వాలి. మజ్జిగ, ఆరెంజ్ జ్యూస్, పీచు పదార్థాలుంటే పండ్లను ఇవ్వాలి. స్కూల్స్ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఆకలిస్తే ఎండుద్రాక్షలు తినే అలవాటు చేయండి. తద్వారా పిల్లల్లో ఈజీగా ఎనర్జీ లభిస్తుంది. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ల వేసవిలో పక్కన పెట్టేయండి. వీటికి బదులు గోధుమలతో చేసిన వంటకాలను తీసుకోనివ్వండి. 
 
ఆధునికత పేరుతో మనం తీసుకునే ఆహారంతో అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. అందుచేత రెడిమేడ్ ఫుడ్‌ను శుభ్రంగా పక్కనబెట్టేయండి. ఇవి పిల్లల ఆరోగ్యానికి కూడా మంచివి కావు. వేసవిలో ఫాస్ట్ ఫుడ్‌ను పక్కన పెట్టేయాలి. పిజ్జా, పాస్తా వంటివి మైదాతో చేయడం ద్వారా ఆరోగ్యానికి అంత మంచివికావు. వీటికి బదులు గోధుమలతో చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. 
 
నూనెలో వేయించిన పదార్థాలు, హైడ్రోజన్ అధికంగా గల నూనెల్ని అధికంగా వాడొద్దు. అజీర్ణ సమస్యలను కలిగించే ఆహారం ద్వారా పక్షపాతం, క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌లకు బదులు తాజా పండ్ల రసాలను పిల్లలకు అలవాటు చేయడం మంచిది. ఎంతమేరకు చిరుతిండ్లను తగ్గిస్తామో.. ఆరోగ్యానికి అంత మేలని వారు సూచిస్తున్నారు. 
 
అలాగే బాదం, ఆక్రూట్ వంటివి ఇవ్పొచ్చు. విటమిన్ ఎ, సి, ఈ పుష్కలంగా ఉండే ఖర్జూరం, కిస్ మిస్, అత్తిపండ్లు వంటివి ఇవ్వడం ద్వారా పిల్లల్లో వేసవికి తగిన ఎనర్జీ లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పుదినుసులు కూడా పిల్లల డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu