Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలకు చిరుతిళ్లు మాన్పించాలంటే..?

పిల్లలకు చిరుతిళ్లు మాన్పించాలంటే..?
, శనివారం, 17 జనవరి 2015 (16:11 IST)
ఒక్కసారిగా పిల్లల్లో చిరుతిళ్ల అలవాటు మాన్పించాలంటే అంత సులభం కాదు. కరకలలాడేవీ, తీపి లేదా ఉప్పు, మసాలా పదార్థాలాంటి వాటిని పిల్లలు ఒక్కసారి రుచి చూశాక.. వాటిని తినకుండా ఉండలేరు. అలాంటప్పుడు చిరుతిళ్లు మానేయ్ అనడంలో అర్థం లేదు. పూర్తిగా కాకుండా.. ముందు వాటి మోతాదును తగ్గించుకుంటూ రావాలి. క్రమంగా పూర్తిగా తినకుండా చేయాలి. అప్పుడే వాళ్లకి ఆసక్తి తగ్గుతుంది.
 
* స్కూలుకు వెళ్లేటప్పుడు ఎలాంటి పదార్థాలు ఇష్టపడుతున్నారనేది గమనించండి. దాన్ని బట్టీ వాళ్లు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయండి. ముఖ్యం నోరూరించేవీ, ఆకట్టుకునేలా కనిపించే పదార్థాలను ఇంట్లోనే చేసి పెట్టండి. పిల్లల చేతికి డబ్బులిచ్చి.. కొనుక్కోమని చెప్పకుండా.. వాటిని మీరే కొని బాక్సుల్లో సర్దేస్తే బెటర్. 
 
* జంక్ ఫుడ్స్ ఎంత పేచీ పెట్టినా తక్కువ మోతాదులో కొనండి. ఒకవేళ ఎక్కువ కొని నిల్వ చేయాలనుకున్నా ఆ పదార్థాలు వారికి కనబడకుండా చూడాలి. 
 
* జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అతిగా తినడం ద్వారా కలిగే దుష్ఫ్రభావాలను పిల్లలకు వివరించండి. ఇంట్లోనే జంక్ ఫుడ్ చేసి పిల్లలకు వడ్డించాలి. పానీయాలు, పండ్లరసాలు పూర్తిగా చక్కెర లేని రకాలను ఎంచుకోవాలి. 
 
* పోషకాహారాన్ని ఒకేసారి తినమన్నా పిల్లలు ఇష్టపడకపోవచ్చు. ముందు కొద్దిగానే అలవాటు చేయాలి. తర్వాత వాళ్లంతట వాళ్లే వడ్డించుకుని తినేలా ప్రోత్సహించాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu