Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొదుపులో పిల్లలకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్.. ఎలా?

పొదుపు అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యం. సంపాదించే ప్రతి రూపాయిలో కొంత మొత్తంలో దాచిపెట్టాలి. అలాకానిపక్షంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని సతమతమవ్వాల్సిందే. అందువల్ల కన్నబిడ్డలకు కూడా కూడా పొదుప

Advertiesment
పొదుపులో పిల్లలకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్.. ఎలా?
, సోమవారం, 27 ఆగస్టు 2018 (11:00 IST)
పొదుపు అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యం. సంపాదించే ప్రతి రూపాయిలో కొంత మొత్తంలో దాచిపెట్టాలి. అలాకానిపక్షంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని సతమతమవ్వాల్సిందే. అందువల్ల కన్నబిడ్డలకు కూడా కూడా పొదుపు విలువ గురించి వివరించాలి. ఈ బాధ్యత తల్లిదండ్రులదే. పొదుపు విషయంలో పిల్లలకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్‌గా ఉండాలి.
 
ఆర్థిక సంబంధమైన విషయాలు వారికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వడం గొప్పగా ఫీలవుతున్నారు. వాళ్లు అడిగినవి వారికి నిజంగా అవసరమా లేదా? తమ తాహతుకు మించి అడుగుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాలి. చిన్నప్పటి నుంచే డబ్బు విలువ, ఎలా సంపాదిస్తున్నాం? ఎలా ఖర్చుపెట్టాలి? అనేది తెలిపితే… పెద్దయ్యాక వారికెంతో ఉపయోగపడుతుంది. 
 
* మార్కెట్‌కు వెళ్లేటపుడు పిల్లల్ని కూడా తీసుకెళ్లాలి. ఏమేం కొనాలి, ఎంత బడ్జెట్ ఉంది అలాంటి విషయాలపై వారికి అవగాహన కల్పించాలి.
* డబ్బు ఆదా చేయడం కూడా నేర్పించాలి. ఏదైనా వస్తువు కొనేముందు ఆలోచించమనాలి చెప్పాలి. 
* చూసిన ప్రతిదీ కొనకుండా ఏది అవసరమో దాన్ని మాత్రమే కొనుగోలు చేసేలా వారికి సలహా ఇవ్వాలి. 
* కొంత డబ్బును చారిటీలకు ఇవ్వడాన్ని చిన్నప్పటినుంచే నేర్పించాలి.
* అప్పుడప్పుడూ వాళ్లను అనాథాశ్రమాలకు తీసుకెళ్లడం వల్ల వారికి కష్టాలంటే ఏంటో తెలియజెప్పాలి. అపుడే డబ్బుకు విలువ ఇవ్వడం తెలుసుకుంటారు.
* పిల్లలకు ఇచ్చే డబ్బును పొదుపు చేసుకోమని చెప్పాలి. ఇలాంటి సలహాలు, సూచనలు చేసినట్టయితే పిల్లలు చిన్నవయసు నుంచే పొదుపుకు అలవాటు పడటమేకాకుండా, మనీ మేనేజ్‌మెంట్‌ను చక్కగా పాటిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ క్యాబేజీని తీసుకుంటే?