Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#HappyNewYear2018 శిశు జననాల్లో భారత్ అగ్రస్థానం

కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణా

Advertiesment
#HappyNewYear2018 శిశు జననాల్లో భారత్ అగ్రస్థానం
, బుధవారం, 3 జనవరి 2018 (13:13 IST)
కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణాంకాలను వెల్లడించింది. 
 
ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, 2018, జనవరి ఒకటో తేదీన మొత్తం 3.86 లక్షల మంది శిశువులు జన్మించినట్టు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లో జన్మించారు. మన దేశంలోనే మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. 
 
ఆ తర్వాతి స్థానాల్లో చైనా (44,760), నైజీరియా (20,210), పాకిస్థాన్ (14,910), ఇండోనేషియా (13,370), అమెరికా (11,280), కాంగో (9,400), బంగ్లాదేశ్ (8370) ఉన్నాయి. అయితే, ఈ చిన్నారుల్లో కొంతమంది మొదటి రోజే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో క్యాబేజీ తురుము సూప్ తాగితే..