Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐన్ స్టీన్‌నే మించిపోయిన బుడతడు.. ఐక్యూలో ఒవెన్ అదుర్స్!

ఐన్ స్టీన్‌నే మించిపోయిన బుడతడు.. ఐక్యూలో ఒవెన్ అదుర్స్!
, సోమవారం, 6 ఏప్రియల్ 2015 (12:47 IST)
పిట్ట కొంచెం, కూత ఘనమన్న సామెత నిజమేనని ఆ బుడతడు నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్‌లోని వార్త్ యార్క్ షైర్‌కు చెందిన ఒవెన్ డన్ అనే 11 ఏళ్లు కూడా నిండని బాలుడు ఐక్యూలో అదుర్స్ అనిపించాడు. ఎందుకంటే, తెలివితేటల్లో అతడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ నే మించిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి ఆధునిక యుగంలో తెలివితేటలనూ కొలుస్తున్నాం. ఇందుకోసం ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషియంట్) పేరిట కొలమానం కూడా అందుబాటులోకి వచ్చింది.
 
ఐన్ స్టీన్ కాలంలో ఈ కొలమానం అందుబాటులో లేకున్నా, ఆయన ఆవిష్కరణలను విశ్లేషించిన నేటి సైంటిస్ట్‌లు ఆయన ఐక్యూను 160గా తేల్చేశారు. అయితే ఈ స్థాయిని ఒవెన్ డన్ దాటేశాడు. అతడి ఐక్యూ 162గా తేలిందట. పాఠశాలలో అతడి అసాధారణ తెలివితేటలకు అచ్చెరువొందిన ఉపాధ్యాయులు అతడి ఐక్యూను కొలవమని మెన్సా సొసైటీని కోరారట. ఒవెన్ డన్‌కు బ్రెయిన్ టెస్ట్ ను నిర్వహించిన సొసైటీ సిబ్బంది అతడి ఐక్యూ లెవెల్స్ చూసి నోరెళ్లబెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu