Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారుల "హోంవర్క్" అంటే ఎలా ఉండాలి..?

Advertiesment
బాలప్రపంచం
FILE
"ఏదైనా అతి అయితే.. అనర్థదాయకమే...!" చిన్నారుల హోంవర్క్ విషయంలో బాలల నిపుణులు చెప్పేమాట కూడా ఇదే. స్కూలు నుంచి రాగానే ట్యూషన్లు.. అక్కడినుంచి రాగానే హోంవర్క్.. ఇదంతా పూర్తిచేశాక భోజనం, నిద్ర... ఇదీ మన చిన్నారుల సాయంత్రపు టైం టేబుల్. తల్లిదండ్రుల ముద్దు మురిపాలకు, ఆటపాటలకు దూరంచేసే ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణుల అభిప్రాయం.

కిండర్‌గార్డెన్ నుంచి రెండు, మూడు తరగతుల వరకు అసలు హోంవర్క్ లేకపోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. తరగతి గదిలో విన్న పాఠాలు పిల్లలకు ఎంతవరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు హోంవర్క్‌ని మించిన సాధనం ఏదీ లేదన్నది వాస్తవమేననీ, హోంవర్క్ లక్ష్యం కూడా ఇదేననీ వారంటున్నారు. అయితే, ఈ సాధనాన్ని ఉపయోగించుకునే విధానం లోపభూయిష్టంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు.

కాబట్టి... పిల్లలు చేసిన హోంవర్క్‌నుబట్టి వారికి తాము నేర్పిన పాఠాలు ఏ మాత్రం చెవికెక్కాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మొదటగా ఉపాధ్యాయులదీ, ఆ తరువాత తల్లిదండ్రులది అని నిపుణులు అభిప్రాయపడ్డారు. హోంవర్క్‌లో తాము చేసిన తప్పొప్పుల నుంచి తమ లోపాలను, సామర్థ్యాలను విద్యార్థులు అంచనా వేసుకోగలుగుతారనీ... అయితే రెండు, మూడు తరగతులలోపు విద్యార్థులు ఆ పని అస్సలు చేయలేరన్నారు.
చదువులో వెనుకబడ్డవారే...!
సాధారణంగా చదువులో కాస్త వెనుకబడ్డ విద్యార్థులే హోంవర్క్ విషయంలో సైతం వెనుకబడి ఉంటారు కాబట్టి, అందరు విద్యార్థులను ఒకేగాటన కట్టకుండా, అలాంటి విద్యార్థులను టీచర్లు ఎంపికచేసి, వారి స్థాయికి తగినట్లుగో హోంవర్క్ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొంది...
webdunia


కాబట్టి, అందుకు తగినట్లుగా అవసరమైతే తమ బోధనా విధానంలో మార్పు చేసుకునేందుకు అధ్యాపకులు సిద్ధంగా ఉండాలనీ.. ఒకవేళ విద్యార్థుల విషయంలోనే లోపముందని భావిస్తే, వారితో నేరుగా మాట్లాడి అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవసరం అయితే విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి సమస్య పరిష్కారంలో వారి సహకారం తీసుకోవాలనీ, హోంవర్క్ చేయని విద్యార్థులను దండించటం సరికాదని అన్నారు.

సాధారణంగా చదువులో కాస్త వెనుకబడ్డ విద్యార్థులే హోంవర్క్ విషయంలో సైతం వెనుకబడి ఉంటారు కాబట్టి, అందరు విద్యార్థులను ఒకేగాటన కట్టకుండా, అలాంటి విద్యార్థులను టీచర్లు ఎంపికచేసి, వారి స్థాయికి తగినట్లుగో హోంవర్క్ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి పురోగతిని అంచనా వేస్తూ, అవసరమైన మార్పులు చేయాలని నిపుణులు సూచించారు.

అదలా ఉంచితే... హోంవర్క్ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదేనననీ, ఎప్పుడూ హోంవర్క్ చేయండర్రా అంటూ వారివెంటపడి అడగటం కాకుండా.. హోంవర్క్ ఉద్దేశ్యం ఏంటి, దాని ద్వారా పిల్లల సామర్థ్యం ఏ మేరకు బయటపడుతుందనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు ఎలాంటి హోంవర్క్ ఇస్తున్నారు? దాని వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందా? అని తల్లిదండ్రులు పరిశీలించాలనీ.. ఒకవేళ ఏవైనా లోపాలు ఉన్నట్లు అనిపిస్తే, నేరుగా టీచర్లను కలిసి కలిసి మాట్లాడేందుకు వెనుకాడవద్దని కూడా నిపుణులు సూచిస్తున్నారు. తరచూ చిన్నారుల హోంవర్క్‌ను పరిశీలించినట్లయితే, వారి పురోగతి ఏంటో కూడా పెద్దలకు అర్థమవుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu