యూపీఎ ఏకపక్షంగా తనను టార్గెట్ చేసి వేధిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ జగన్ హస్తినలో విపక్ష నేతల వద్ద వాపోయారు. అంతేకాదు దీనిపై అందరికీ ఓ లేఖ కూడా రాశారు.
యూపీఏ తనను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ తనను, తన కంపెనీల్లో పెట్టిన పెట్టుబడిదారులను సోదాల పేరుతో వేధిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తనకు ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రతిపక్ష నాయకులకు తన లేఖ ద్వారా సూచించారు.