వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ కాని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ప్రకటించారు. సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు అన్ని జిల్లాల్లో ఓదార్పు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో జగన్ తన ఓదార్పును తెలంగాణ జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కుర్చీ ఎవరు లాక్కుంటారోనని వణికిపోతున్నారని చెప్పుకొచ్చారు. అందుకే సమయం, సందర్భం లేకున్నా తనకేదో పట్టు ఉందన్నట్లు సాధ్యం కాని పథకాలను జనంపై గుప్పిస్తున్నారని విమర్శించారు.
బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేశారనీ, ఏ క్షణంలోనైనా ఆ కుర్చీని ఆయన లాక్కోవడం ఖాయమని కొండా సురేఖ జోస్యం చెప్పారు. జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.