జగన్‌కు 2012లోనే కాదు... 2013లో కూడా బెయిల్ రాదట...
, శనివారం, 24 నవంబరు 2012 (19:08 IST)
అక్రమాస్తుల కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ఈ ఏడాది 2012 కాదు... వచ్చే ఏడాది 2013లో బెయిల్ వస్తుందన్న నమ్మకం లేదంటూ పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమందయితే జగన్ మోహన్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీతో వైరం పెట్టుకున్నాడనీ, ఆ పార్టీతో గొడవ పెట్టుకున్నందువల్లే జగన్ జైలు పాలయ్యాడన్న వాదనలు కూడా చేస్తున్నారు. ఇకపోతే మరికొందరయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిలో కొందరు స్కాములు ఇరుక్కున్నా వారిపై విచారణ చేసేందుకు దర్యాప్తు సంస్థలు సాహసం చేయలేవన్నది వారి వాదన. కాగా మరికొందరయితే కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ఏ జరుగుతుందో జగన్ మోహన్ రెడ్డికి తెలుసుననీ, అయినా ప్రజాబలంతో పార్టీని ఎదిరించవచ్చన్న ధీమాతోనే సొంత మార్గాన్ని ఎంచుకున్నారని వాదిస్తున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతారు.. ఆయనకు బెయిల్ దొరుకుతుందా లేదా.. అనే విషయం అందరిలోనూ ఆసక్తిని రేకిత్తిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో...?!!