జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో నెలన్నర రోజుల్లో పతనమవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ మేధోమథన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని అన్నారు. ఆ పార్టీ పరిస్థితి ఏంటో క్రమంగా రోజూ చూస్తుంటేనే అర్థమవుతోందన్నారు.
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఎన్నికలు మరో ఆరు నెలలు ఉన్నాయనగా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.