అనంతపురంలో రాజీవ్ యువకిరణాలు సభకు జగన్ వర్గం ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అధ్యక్షతన వహించడమూ, ఆ సభకు మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టడమూ చర్చనీయాంశమైంది.
సభలో గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ... వెనుకబడిన అనంతపురం జిల్లాను ప్రత్యేకంగా పరిగణించి సాయం చేయాలని అర్థిస్తున్నట్లు చెప్పారు. తన ప్రసంగం ముగించేముందు జై వైఎస్సార్ జై కాంగ్రెస్ అని అనడం అది కాంగ్రెస్‌కా లేక వైఎస్సార్ కాంగ్రెస్‌కా అనే సందేహం వ్యక్తమైంది.
మరోవైపు ప్రస్తుత జగన్‌పై సీబీఐ కేసు, ఢిల్లీలో జగన్ యాత్రపై వస్తున్న వ్యాఖ్యల నేపధ్యంలో జగన్ వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికే వస్తారన్న వాదనలు ఊపందుకున్నాయి. దీనికి నిదర్శనంగానే సీఎం సభలో గుర్నాథరెడ్డి ప్రత్యక్షమవడం అని చెపుతున్నారు.