జగన్ బఫూన్ ఎలా ఉంటాడో చూసేందుకే జనం వస్తున్నారు
, బుధవారం, 14 సెప్టెంబరు 2011 (19:55 IST)
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాలడగు వెంకట్రావు జగన్ మోహన్ రెడ్డిపై విరుచుక పడ్డారు. కృష్ణాజిల్లా నూజివీడులో ఓదార్పు యాత్ర సాగిస్తున్న జగన్ ను ప్రజలు ఓ బఫూన్ లా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ బఫూన్‌ను చూసేందుకు జనం వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పాలడగు ఆరోపించారు. జగన్‌ను వైఎస్సార్ కుమారునిగా గౌరవిస్తాను తప్పించి, అతని మోసాలను మాత్రం గౌరవించలేనని అన్నారు. ఇదిలావుండగా గతంలో శంకర్రావు జగన్‌ను ఇలా విమర్శించే మంత్రి పదవి కొట్టేశారనీ, ఇపుడు పాలడుగు కూడా ఇలాంటి జిమ్మిక్కునే అనుసరించి వచ్చే మంత్రివర్గ పునర్వవస్థీకరణలో పదవిని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నట్లు వాదనలు వినబడుతున్నాయి.