Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పార్టీలో సీట్ల గొడవ... 2014లో అసలు జగన్ సీఎం అవుతారా...?!!

Advertiesment
జగన్ పార్టీలో సీట్ల గొడవ... 2014లో అసలు జగన్ సీఎం అవుతారా...?!!
, గురువారం, 28 ఫిబ్రవరి 2013 (14:30 IST)
WD
జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 2014 ఎన్నికల నాటికి పోటీ చేసేందుకు అప్పుడే సీట్ల గొడవ మొదలయింది. ఇదిలావుంటే ఆస్తుల కేసులో జైలులో ఉన్న జగన్ 2014 నాటికి అసలు బయటకు వస్తారా... బయటకు వచ్చి సీఎం అవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ జరుగుతూనే ఉంది. మరోవైపు జగన్ బెయిలు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకూ జగన్ ఆస్తుల కేసు నుంచి బయటపడుతారనే దాఖలాలు కనబడకుండా ఉన్నాయి. ఇంకోవైపు 2014 ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ ప్రజల్లో జగన్‌ మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణను చూసి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మెల్లిమెల్లిగా జారుకుంటున్నారు. ఇప్పుడు కనుక జగన్ శిబిరంలోకి వెళ్లకపోతే 2014 నాటికి అన్ని బెర్తులు ఫుల్ అయిపోతాయని ఆయా పార్టీల ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేల తాకిడి ఎక్కువవుతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. మొదట్నుంచీ పార్టీని అంటిపెట్టుకున్నవారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తూ కర్చీఫ్ వేసి పెట్టుకున్నారు.

ఈ సమయంలో హఠాత్తుగా ఇతర పార్టీల నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు సిట్టింగ్ స్థానాలు తమకే కావాలని అడుగుతూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ పరిస్థితి నుంచి జగన్ పార్టీ ఎలా బయటపడుతుందో... అన్నిటికీ మించి 2014 నాటికి జగన్ జైలు నుంచి బయటపడతారో లేదో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu