గెలిచాం కదా అని ఇంట్లో కూచోకండి.. వెళ్లండి జనంలోకి... జగన్
, శుక్రవారం, 22 జూన్ 2012 (12:08 IST)
ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.. గెలిచిపోయాం కదా అని ఇంట్లో కూచోవద్దనీ, ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వం మెడలు వంచాలని జైల్లో తనను కలిసిన ఎమ్మెల్యేలతో జగన్ చెప్పినట్లు సమాచారం. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకముంచి విజయం కట్టబెట్టారనీ, ఆ నమ్మకాన్ని పదింతలు చేస్తూ ప్రజల కోసం పోరాడాలని చెప్పారు. మరోవైపు జగన్ జైల్లో ఉంటే పార్టీకి దిశానిర్దేశంలో ఇబ్బంది తలెత్తదా.. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వైకాపా ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ... తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు అన్నీ చూసుకుంటారని వ్యాఖ్యానించారు.