గాలి అరెస్టుతో జగన్ బెంబేలు: కాంగ్రెస్‌తో బేరసారాలకై పరుగు
, సోమవారం, 5 సెప్టెంబరు 2011 (16:02 IST)
అక్రమ ఆస్తుల కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా గాలి జనార్థన్ రెడ్డి అరెస్టుతో బెంబేలెత్తిపోయి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఢిల్లీకి పరుగు తీశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి 30 ఏళ్లపాటు సైనికుడిలా పనిచేశాడని చెప్పుకుంటున్న జగన్ ప్రజాసమస్యలపై కాకుండా వివిధ రాజకీయ పార్టీల నేతలను కలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటన కేవలం కాంగ్రెస్ పార్టీతో బేరసారాలు చేసుకొనేందుకేనన్న సందేహాన్ని లేవనెత్తారు. గాలి జనార్ధనరెడ్డి అరెస్టు తెలుగుదేశం పార్టీ తొలి విజయం అని ఆయన వ్యాఖ్యానించిన పయ్యావుల త్వరలో జగన్ అక్రమాల చిట్టా బయటపడుతుందని అన్నారు.