ఇంకొందరు ఎమ్మెల్యేలు వస్తారు: జగన్‌తో 'అభిమాన' ఎమ్మెల్యేలు
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2012 (21:09 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకొందరు ఎమ్మెల్యేలు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని వైకాపా అభిమాన ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని జగన్ క్యాంప్ కార్యాలయంలో అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ భేటీలో శాసనసభలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వారితో చర్చించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగానే ఉన్నట్లు వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలోనే గందరగోళం నెలకొని ఉందని వారు చెప్పుకొచ్చారు. కాగా శాసనసభలో ప్రతిపక్షం పాత్ర పోషించాలని ఈ సమావేశంలో జగన్ వారికి సూచించినట్లు సమాచారం. ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిసింది.