జగన్ లోటస్‌పాండ్ భవనాల విలువపై సీబీఐ లెక్కలు
, గురువారం, 20 అక్టోబరు 2011 (13:13 IST)
జగన్ అక్రమ ఆస్తుల కేసులో భాగంగా సీబీఐ గురువారం హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ ఇళ్ల విలువను లెక్కగడుతోంది. లోటస్‌పాండ్‌లో సుమారు 4 వేల గజాలలో నిర్మించిన నాలుగు ఇళ్లు రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేశారన్న అభియోగాల నేపధ్యంలో సీబీఐ విచారణ చేస్తోంది. నాలుగు వేర్వేరు ప్లాట్లుగా నిర్మించిన ఈ ఇళ్ల విలువను లెక్కగట్టేందుకు సీబీఐ అధికారులకు ఐటీ, జీహెచ్ఎం అధికారులు సహకరిస్తున్నారు. జగన్ ఇంటి వద్దకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ప్రతినిధులను కూడా రప్పించి ప్రత్యేకంగా అంచనాలు వేస్తున్నారు. కాగా లోటస్‌పాండ్ గృహంలో సిబిఐ ఇంతకుముందే సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు 35 రోజులుగా జగన్ ఆస్తులు, లావాదేవీలకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేస్తున్న సీబీఐ నేడు హైదరాబాదులోని లోటస్ పాండ్ జగన్ భవనాలపై దృష్టి సారించింది.