ఐఫోన్ ద్వారా మొబైల్ మార్కెట్‌లో సంచలనాలకు నాంది పలికిన ఆపిల్ సంస్థ ఈ ఫోన్‌లో అందిస్తున్న సదుపాయాలు అన్నీ ఇన్నీ కాదు. ఆపిల్ ఐఫోన్ చేతిలో ఉంటే.. ఇంటర్నెట్, షాపింగ్, హెల్త్, మ్యాప్స్, వినోదం, ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ మన చేతిలో ఉన్నట్లే.
ఒక మాటలో చెప్పంచాలంటే.. ఐఫోన్ అరచేతిలో ఉన్న ఒక మినీ ప్రపంచం. ఇప్పటికే చాలామంది డెవలపర్లు ఇందుకోసం వేలాది అప్లికేషన్లను తయారు చేసారు. ఇప్పుడు ఈ ఐఫోన్‌ను వైద్యులు స్టెతస్కోపుకు ప్రత్యామ్నాయంగా ఉపయెగిస్తున్నారు. అదెలా అంటారా..? అవును మరి ఐఫోన్ కోసం కొత్తగా రూపొందించిన అప్లికేషన్ గుండె చప్పుడును తెలుసుకోవచ్చు.
యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన "పీటర్ బెంట్లీ" అనే శాస్త్రవేత్త ఇప్పటికే ఐఫోన్‌లో కొన్ని సెన్సార్లను ఆధారంగా చేసుకొని "ఐస్టెతస్కోపు" అనే అప్లికేషన్‌ను తయారు చేశారు. దీని ద్వారా మనుషుల గుండె చప్పుడును గుర్తించవచ్చు.
మొదట సరదా కోసమే దీనిని తయారు చేసిన ఇప్పడు మాత్రం ఇది హాట్ అప్లికేషన్ అయిపోయింది. ఎంతంటే రోజుకి దాదాపు 500 అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట. భవిష్యత్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్, రక్తపోటు(బ్లడ్ ప్రెషర్)ను లెక్కించటం వంటి అప్లికేషన్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేందటున్నారు నిపుణులు.