భారతీయ పురాతన వారసత్వ పరిరక్షణకు ఉద్దేశించిన కాన్సర్వ్హెరిటేజ్ వెబ్‌సైట్ చెన్నైలో ఆవిష్కరించబడింది. పురావస్తు శాస్త్రం మరియు భారత పురావస్తు సైన్సెస్ అకాడమి రూపొందించిన వెబ్‌సైట్‌ను తమిళనాడు గవర్నర్ సూర్జిత్ సింగ్ బర్నాలా ఆవిష్కరించారు. అదే సమయంలో తమిళ పురాతన సాహిత్య అధ్యయనంపై ప్రత్యేక ఆన్‌లైన్ కోర్సును గవర్నర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వెబ్‌సైట్ రూపకర్త సత్యమూర్తి మాట్లాడుతూ గ్రామీణ యువతరాన్ని పర్యాటక మార్గదర్శకులుగా రూపొందేంచుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే శిలా శాసనాలు మరియు తాళపత్ర గ్రంధాల పఠనానికి ఉపకరించే శిక్షణ కూడా అందిస్తున్నట్లు సత్యమూర్తి వెల్లడించారు.