Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొబైల్స్‌లో కొత్త ఫీచర్ల వైపు మొగ్గు చూపుతున్న యువత!!

Advertiesment
మొబైల్స్ ఫోన్స్
File
FILE
నిత్యావసర వస్తువుగా మారిన మొబైల్ ఫోన్స్ ఇపుడు ఓ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. దీంతో యువత కొత్తకొత్త మొబైల్ ఫోన్లపై యువత ఎక్కువగా మోజు చూపిస్తున్నారు. ఈ కొత్త ఫోన్లలో కూడా కొత్త తరహా ఫ్యూచర్లకే వారు ఎక్కువగా మొగ్గు చూపుతుండటం గమనార్హం.

దీంతో ఫోను కొన్న రెండేళ్ళలోనే తమ హ్యాండ్‌సెట్‌ను మార్చే వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోందని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా.. దేశ టెలికామ్ మార్కెట్ పొరుగు దేశాలతో పోల్చుకుంటే శరవేగంగా వృద్ధి చెందుతుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం దేశంలో వైర్‌లెస్ వినియోగదారులు 89.2 కోట్ల మంది ఉన్నారని పరిశ్రమకు చెందిన అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఆ సంస్థ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలలో యువతపై నిర్వహించిన ఈ సర్వేలో 39 శాతం మంది కొత్త అప్లికేషన్ల కోసం రెండేళ్లలోపే మొబైల్ ఫోన్‌ను మారుస్తున్నట్టు తేలింది.

దీనికి కారణం లేకపోలేదు. అతి తక్కువ ధరకే కొంగ్రొత్త ఫ్యూచర్లతో హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రావడం వారికి అనుకూలంగా మారింది. అంతేకాకుండా... ధరలు తగ్గడం, ప్రజల ఆదాయం పెరగడం కూడా కొత్త ఫోన్లను కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపుతున్నట్టు అసోచామ్ తెలిపింది.

యువకులు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయడానికి అప్లికేషన్లు, బ్లూటూత్, జీపీఆర్‌ఎస్, కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ వంటి ప్రధాన ఫీచర్లు ప్రధాన ప్రాత పోషిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్, సంగీతం వినడానికి, ఆటలు ఆడుకోవడానికి, వార్తలను చదవడానికి, నెట్ చూసుకోవడానికి, స్నేహితులు, కుటుంబసభ్యులతో ఛాటింగ్ చేయడానికి మొబైల్ ఫోనును వారు వినియోగిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu