మీకోసం మరో సరికొత్త శీర్షిక... వెబ్‌దునియా క్వెస్ట్
వీక్షకుల కోసం వెబ్‌దునియా మరో సరికొత్త శీర్షిక వెబ్‌దునియా క్వెస్ట్‌ను ప్రారంభించింది. మీ మనసులో మొలకెత్తే సందేహాలను ఇక్కడ జోడించవచ్చు, అదే విధంగా ఎవరో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలనివ్వవచ్చు. ప్రశ్నలను అడగటానికి వెబ్‌దునియా క్వెస్ట్ ప్రధాన పేజీ పైభాగంలో ఉన్న ఖాళీలో టైప్ చేసి సబ్‌మిట్ చేయండి. అంతే... మీ ప్రశ్న నమోదవుతుంది. అలాగే వేరెవరైనా ప్రశ్నలు అడిగితే, మీరు వాటికి సమాధానాలు ఇవ్వవచ్చు, మీ ప్రశ్నలను వివిధ వర్గాలకు సంబంధించి అడగవచ్చు, ఆటోమొబైల్స్, రాజకీయాలు, ఆధ్యాత్మికం, ఆహారం & పానీయం, ఇన్సూరెన్స్, పర్యావరణం, ట్రావెల్, ఇన్వెస్ట్‌మెంట్, సౌందర్యం & నగలు, సంఘటనలు, క్రీడలు, ఆరోగ్యం, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్... ఇలా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు వినోదానికి సంబంధించిన విభాగాన్ని చూస్తే, అందులో మరో 8 ఉపవర్గాలు ఉన్నాయి. మీ ప్రశ్న ఏ ఉపవర్గానికి చెందినదో చూసుకుని అందులో మీరు నమోదు చేయవచ్చు. సమాధానాలను తెలుసుకోవటంలోనూ ఇదే పద్ధతి. అయితే ప్రశ్నను అడగటానికి లేదా సమాధానం జోడించటానికి వెబ్‌దునియా మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. తెలియని ఎన్నో అంశాలను ప్రశ్నలను సంధించి తెలుసుకోండి. మీకు తెలిసిన సమాధానాలను పొందుపరచండి. వెబ్‌దునియా క్వెస్ట్‌లో పాల్గొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి .