Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటితో మైక్రోచిప్‌కు 50 ఏళ్లు...

Advertiesment
ఐటి కథనాలు మైక్రోచిప్ కంప్యూటర్ మొబైల్ ఫోన్ ఎలెక్ట్రానిక్ పరికరం ట్రాన్సిస్టర్ స్ట్రిప్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రానిక్స్
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (16:29 IST)
వంట సామగ్రినుంచి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌ల దాకా ప్రపంచంలోని ఎలెక్ట్రానిక్ పరికరాలను శాసిస్తున్న మైక్రోచిప్‌ ఆవిర్భవించి నేటికి 50 ఏళ్లు నిండింది. అద్దం పలకకు ఒక ట్రాన్సిస్టర్ మరియు ఇతర విడిభాగాలు అంటించబడి, జెర్మేనియమ్ స్ట్రిప్‌తో కూడి ఉన్న ప్రపంచపు మొట్ట మొదటి మైక్రోచిప్ లేదా ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్‌ 1958 సెప్టెంబర్ 12న టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీచే ప్రదర్శించబడింది.

కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగి జాక్ కిల్బీ ప్రపంచ సాంకేతిక గతిని మార్చిన ఈ సూక్ష్మ పరికరాన్ని సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఆవిష్కరించారు.ఆ రోజు అతడు ప్రదర్శించిన ఈ చిన్ని డివైస్.. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని దాంతో పాటు ప్రపంచాన్ని విప్లవీకరిచిందంటే ఆశ్చర్యపోవలసింది లేదు.

అంగుళంలో సెవన్ 16వ వంతు పరిణామంతో -11.5 మిల్లీమీటర్లు- కూడిన ఈ మైక్రోచిప్ నిజం చెప్పాలంటే ఆధునిక కంప్యూటర్ పరిశ్రమను సృష్టించిన ఘనతను సాధించింది. మైక్రోచిప్‌ లేని ఇంటర్నెట్‌ను ఊహించడం కూడా సాధ్యం కాదంటే ఈ చిప్ ప్రభావం మనకు అర్థమవుతుంది.

ఇంటెగ్రేటెడ్ చిప్ అనేది మన జీవితాల్లో ఎంతగా ఇమిడిపోయిందంటే ప్రస్తుతం ఇది లేని ప్రపంచాన్ని ఎవరూ ఊహించలేరు అని గార్ట్నర్ సంస్థ టెక్నాలజీ విశ్లేషకుడు జిమ్ టులీ ఈ సందర్భంగా అభివర్ణించారు. ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్ మానవ సమాచార యుగానికి చోదకశక్తి లాంటిదని టులీ వర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu