Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలో గూగుల్ నుంచి వాయిస్ కాలింగ్ ఫీచర్..!?

Advertiesment
గూగుల్
ఇంటర్నెట్‌లో ఎన్నో మార్పులకు, విప్లవాలకు, సంచలనాలకు నాంది పలికిన గూగుల్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. గూగుల్ అందిస్తున్న ప్రతిష్ట్మాత్మక మెయిలింగ్ సిస్టమ్ "జీమెయిల్" నుంచి త్వరలోనే మొబైల్ ఫొన్లకు కాల్స్ చేసుకునే సదుపాయం రానుంది. ఇంటర్నెట్ యూజర్లు అందరికీ జీమెయిల్ సుపరిచితమే. దీంతో ఇంటర్నెట్‌ టెలిఫోన్‌ మార్కెట్ రంగంలో ఇప్పటికే ఉన్న పోటీని మరింత తీవ్రం కానుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్ టెలిఫోన్ మార్కెట్ "స్కైపీ" 560 మిలియన్ యూజర్లతో బహుళ ప్రజాదరణ పొందగా మీడియా రింగ్ వంటి మరికొన్ని సంస్థలు కూడా ఇటువంటి సదుపాయాలను అందిస్తున్నాయి. అయితే వీటికి మాత్రం సంబందింత సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసుకోవాల్సి వస్తుంది. కానీ గూగుల్ అందించే వాయిస్ కాలింగ్ ఫీచర్ నేరుగా జీమెయిల్ నుంచే వినియోగించుకోవచ్చని గూగుల్ తన బ్లాగులో తెలిపింది. ఈ అంశంపై గూగుల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ ఫోన్ కాల్స్ చేయడానికి జీమెయిల్ అకౌంట్‌లానే "గూగుల్ వాయిస్ అకౌంట్‌"ను యూజర్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎటువంటి సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేసుకోనవసరం లేదు. ఇది పూర్తిగా వెబ్‌బేస్‌డ్ అప్లికేషన్. ప్రస్తుతం వినియోగిస్తున్న "చాట్" అప్లికేషన్ మాదిరిగానే ఉంటుంది. అమెరికా లేదా కెనడాల ఫోన్ నెబర్లకు కాల్స్‌ ఉచితం. అంతర్జాతీయ కాల్స్‌కు మాత్రం నామమాత్రపు రుసుమును చెల్లించాల్సిందే. అంటే త్వరలో మనం జీమెయిల్ నుంచి ఫోన్ చేసుకోబోతున్నాం అన్నమాట....!

Share this Story:

Follow Webdunia telugu